Tuesday, March 17, 2026

మిషన్ భగీరథ పైపులైను మరమత్తులను త్వరగా పూర్తి చేయాలి

  • జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

నేటి సాక్షి, మెట్ పల్లి : మిషన్ భగీరథ పైపులైను మరమత్తులను త్వరగా పూర్తి చేయాలనీ జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు. మెట్‌పల్లి పట్టణ శివారులో గల మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ మరమ్మత్తు పనులను మంగళవారం సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన పనుల పురోగతిని సమీక్షించి,సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.మిషన్‌ భగీరథ ప్రాజెక్టు ద్వారా ప్రతి ఇంటికి శుద్ధమైన త్రాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ క్రమంలో పనులను వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. పైప్‌లైన్‌ కేజీలు, మరమ్మతులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రజలకు నిరంతర నీటి సరఫరా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు, సిబ్బంది కలెక్టర్‌ సూచనలను పాటించి ప్రాజెక్టు విజయవంతానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెట్ పల్లి ఆర్డీవో శ్రీనివాస్, డిఆర్డిఓ రఘువరన్, మిషన్ భగీరథ ఈఈ శేఖర్ రెడ్డి, డిఈ.ప్రేమ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ మోహన్, ఎంపీడీవో,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News