
నేటి సాక్షి ప్రతినిధి, రుద్రంగి :
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ఆహ్లాద పర్వతంపై కొలువుదీరిన శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారిని శుక్రవారం ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మరియు ఆలయ కమిటీ సభ్యులు ప్రభుత్వ విప్ కు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ కొమిరె శంకర్ ఎమ్మెల్యే ను శాలువతో సన్మానించి స్వామివారి చిత్రపటన్ని అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… నూతన సంవత్సరం సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోవడం జరిగిందని అన్నారు. ఆ స్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు పాడిపంటలతో సంతోషంగా ఉండాలని వేడుకున్నాట్టు తెలిపారు.

