Tuesday, March 31, 2026

తిరుపతి సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు

నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) తిరుపతి : పెరుగుతున్న జనాభా దృష్ట్యా తిరుపతిలో ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ కళాశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బుధవారం అసెంబ్లీ లో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కోరారు. టిటిడి ఆధ్వర్యంలో ఉన్న కాలేజీలు మినహా ప్రభుత్వానికి సంబంధించి కాలేజీలు లేవని ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళారు. కాగా శెట్టిపల్లి భూమలకు సంబంధించి ముప్పయ్ ఏళ్ళుగా సమస్య పరిష్కారం కాలేదని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లు ఆ గ్రామాన్ని సందర్శించి పరిష్కరిస్తామని చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఐతే గత ఐదేళ్ల దుర్మార్గపు పాలనలో శెట్టిపల్లి వాసుల సమస్యను పరిష్కరించకపోగా మున్సిపాలిటీలో కలిపేశారని ఆయన చెప్పారు. మున్సిపాలిటీ ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్ట లేదని ఆయన చెప్పారు. 2019లో శెట్టిపిల్లిని తుడా పరిధిలో కలిపారని తిరిగి మున్సిపాలిటీ నుంచి తప్పించి తుడా పరిధిలో వెంటనే చేర్చేలా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చొరవ తీసుకోవాలని ఆయన కోరారు. అలాగే 30ఏళ్ళ కిందట వేసిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం వేశారని ఆయన తెలిపారు. డ్రెయినేజీ వ్యవస్థ పాతది కావడంతో నిత్యం డ్రైనేజీ ఇబ్బందులను ప్రజలు ఎదుర్కొంటున్నారని కావున కొత్తగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News