
నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాల భూమి పూజల నిమిత్తం వనపర్తి నియోజకవర్గానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు , ఎక్సైజ్, టూరిజం శాఖ మాత్యులు జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి వస్తున్న సందర్భంగా ఆయా కార్యక్రమాల ఏర్పాట్లను శుక్రవారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పరిశీలించారు. 1.గోపాల్పేట మండలం బుద్ధారం గండి ఆంజనేయ స్వామి ఆలయ సమీపం పొల్కేపహాడ్ గ్రామ శివారులో నిర్మించే గోపాల్పేట, రేవల్లి, ఏదుల మండలాల నూతన వ్యవసాయ మార్కెట్ భూమి పూజ ఏర్పాట్లను పరిశీలించారు. 2. ఖిల్లా ఘణపురం మండలంలో నిర్మించే నూతన వ్యవసాయ మార్కెట్ నిర్మాణం సందర్భంగా చేపట్టే భూమి పూజ కార్యక్రమం పరిశీలించారు. 3. పెద్దమందడి వెల్టూరు గ్రామంలో నూతనంగా నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర నిర్మాణం పనులకు చేపట్టే భూమి పూజ కార్యక్రమం పనులను పరిశీలించారు. అనంతరం ఉన్ని పారిశ్రామిక సహకార సంఘం చేనేత కార్మికులతో ఆయన మాట్లాడారు.4. పెద్దమందడి మండలం మోజర్ల ఉద్యాన కళాశాలలో పెద్దమందడి మండలంలో నూతనంగా నిర్మించనున్న గోడాన్ నిర్మాణాల భూమి పూజకు సంబంధించిన పనులను పరిశీలించారు. 5. పెబ్బేర్ మార్కెట్ యార్డులో నూతనంగా నిర్మించనున్న గోడౌన్ల భూమి పూజ కార్యక్రమం ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు.ఈ సందర్భంగా పెబ్బేరు మండల, పెబ్బేర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కార్యకర్తలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై ఏర్పాట్లకి సంబంధించిన అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో డి సి సి బి జిల్లా అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, పెబ్బేరు మార్కెట్ యార్డ్ అధ్యక్షురాలు ప్రమోదిని రెడ్డి, వనపర్తి మార్కెట్ యార్డ్ ఉపాధ్యక్షులు రామకృష్ణారెడ్డి, ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





