Tuesday, March 24, 2026

పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

నేటి సాక్షి, బెజ్జంకి:
బెజ్జంకి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ సరళి, పోలింగ్ శాతం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల బయట పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్, శానకొండ శ్రవణ్ కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పులి సంతోష్, మచ్చ కుమార్, మాజీ సర్పంచులు రావుల నరసయ్య, చెప్పాల శ్రీనివాస్ గౌడ్, పోతిరెడ్డి మధుసూదన్ రెడ్డి, బైర సంతోష్, ఇస్కిల్లా ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News