నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ( సందెల రాజు) : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం, కొత్తకొండ వీర భద్ర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వీరభద్ర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు వేదమంత్రోత్సవాలతోస్వామి వారి ఆశీర్వచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.





