నేటి సాక్షి, కోరుట్ల టౌన్ (గణేష్ గొల్లపల్లి): కోరుట్ల పట్టణంలోని సీనియర్ జర్నలిస్ట్ అల్లె రాము బార్ అసోసియేషన్ లో సభ్యత్వం పొంది, కోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో సోమవారం ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అడ్వకేట్ అల్లె రాము ను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు దారిశెట్టి రాజేష్, చీటి వెంకట్రావు, ఫహీం,పీర్ల సత్యం,బట్టు సునీల్, ముజాఫర్ అహ్మద్ (సజ్జు), వనతడుపుల అంజయ్య,మోసిన్, అతిక్, చిత్తరి ఆనంద్, ప్రభు, సీనియర్ జర్నలిస్ట్ టైగర్ అలీ నవాబ్ పాల్గొన్నారు.





