Saturday, March 14, 2026

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మదన్మోహన్

నేటిసాక్షిబ్యూరో, నిజామాబాద్, టి.ఎన్ రమేష్ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్, 5.15 కోట్ల రూపాయల నిధులతో, అభివృద్ధి పనులకు శనివారం రోజున శంకుస్థాపన చేశారు. ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని పలు వార్డులలో, టీ యూ ఏఫ్ ఐ డి సి నిధులతో, సీసీ రోడ్ల పనులను, బిటి రోడ్లు మరియు సిసి డ్రైవ్ పనులకు, ఎమ్మెల్యే మదన్మోహన్ శంకుస్థాపనలు చేయడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే మదన్మోహన్, ఎల్లారెడ్డి బస్టాండ్ నిర్మాణ పనులను పరిశీలించారు. సుమారుగా బస్టాండ్ నిర్మాణ పనులు యుద్ధ ప్రతిపాదికన జరుగుతున్నాయని త్వరలోనే నిర్మాణం పూర్తవుతుందని, ఎమ్మెల్యే మదన్మోహన్ తెలిపారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ చరిత్రలో, గతంలో ఎప్పుడు జరగని అభివృద్ధి, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇప్పుడు జరుగుతుందని, ఎమ్మెల్యే మదన్మోహన్ మీడియా ముఖంగా నియోజకవర్గ ప్రజలకు తెలిపారు. ఎల్లారెడ్డిని స్మార్ట్ సిటీగా చేయడమే తన లక్షణమని ఆయన అన్నారు. నూతన బస్టాండు, మినీ వాటర్ ట్యాంక్ బండ్ మరియు హైవే పనుల నిర్మాణాలు జరుగుతున్నాయని, త్వరలోనే ఎల్లారెడ్డి పట్టణ బస్టాండ్ ను ప్రారంభిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఏ అభివృద్ధి పనులకు కూడా నిధులు ఆగకుండా ఎల్లవేళలా ప్రభుత్వ పెద్దలతో కాంట్రాక్టర్లతో మాట్లాడుతూ, పనుల పురోగతిని తెలుసుకుంటున్నామని ఆయన తెలిపారు. నాణ్యతతో అభివృద్ధి పనులను నిర్మించాలని ఎమ్మెల్యే, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఎమ్మెల్యే స్థానిక అధికారులను ఉద్దేశించి పనులలో ఎలాంటి నాణ్యత లోపం జరగకుండా చూసుకోవాలని ఆదేశించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్, మార్కెట్ కమిటీ చైర్మన్, వార్డు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ సీనియర్లు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News