- శ్రీ మూలస్థాన ఎల్లమ్మతల్లికి పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులు
- కోదండ రామాలయం నుంచి ఊరేగింపుగా సారె
- మూలస్థాన ఎల్లమ్మ ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు,
- టీటీడీ డిప్యూటీ ఈవో,ఈవో, ఉత్సవ కమిటీ
- ఉత్సవ కమిటీకి సారెను అందించిన ఎమ్మెల్యే దంపతులు

నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల), చంద్రగిరి గ్రామదేవత శ్రీ మూలస్థాన ఎల్లమ్మ తల్లి సంక్రాంతి ఉత్సవాలలో భాగమైన కొండ చుట్టూ తిరునాళ్ల సందర్భంగా గురువారం ఉదయం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, సుధా రెడ్డి దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రతి ఏడాది కొండ చుట్టూ తిరునాళ్లకు తిరుమల తిరుపతి దేవస్థానం మూలస్థానం ఎల్లమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తూ ఉంది. అందులో భాగంగా గురువారం చంద్రగిరి పాతపేటలో పురాతన కాలం నుంచి పూజలు అందుకుంటున్న కోదండ రామస్వామి వారి ఆలయం నుంచి ఎమ్మెల్యే దంపతులు పట్టు వస్త్రాలను తీసుకొని ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులకు మేళాతాళాల మధ్య పూర్ణ కుంభంతో ఆలయ అర్చకులు, ఈవో, ఉత్సవ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. సారెను ఉత్సవ కమిటీకి అందజేశారు. అమ్మవారి ఆలయంలో
ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలు చేసారు. దర్శనం అనంతరం ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులను ఆలయ అర్చకులు ఆశీర్వదించారు. .ఆలయ కార్య నిర్వహణ అధికారి ఉత్సవ కమిటీ చైర్మన్ తీర్థ ప్రసాదాలు అందజేశారు.అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ చంద్రగిరి రాములవారిగుడి ఆలయం నుండి అనేక సంవత్సరాలుగా అమ్మవారి సంక్రాంతి సందర్భంగా నిర్వహించే కొండచుట్టు మహోత్సవం నాడు శ్రీ మూలస్థాన ఎల్లమ్మ తల్లికి పట్టువస్త్రాలు సమర్పిస్తున్నట్లు తెలిపారు.అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం కలగడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. అమ్మవారి కృపాకటాక్షాలతో చంద్రగిరి ప్రాంతం అభివృద్ధి చెందగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ చంద్రగిరి లో నిర్వహించే కొండ చుట్టు మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించాలని ప్రజలకు తెలపడం జరిగింది. కొండచుట్టు మహోత్సవం నాడు మోతగాళ్లకు గత ఆలయ కమిటీ మీటింగ్ లో చెప్పిన విధంగా 60 మందికి బట్టలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పులివర్తి నాని గారు. ఈ కార్యక్రమంలో ఈవోలు, ఉత్సవ కమిటీ చైర్మన్ మొక్కల చంద్రశేఖర్ రెడ్డి, కమిటీ సభ్యులు కూటమి ప్రభుత్వం నాయకులు మండల పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు, తిరుపతి రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి, సీనియర్ నాయకులు ఇరంగారి రమేష్ రెడ్డి, గౌస్ భాషా, బాలకృష్ణ మూర్తి, తులసీశ్వర రెడ్డి, కన్నయ్య నాయుడు, కాపువీది సునీల్ సావిత్రి, కార్యకర్తలు మహిళలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.





