Tuesday, March 24, 2026

మాజీ స‌ర్పంచుల‌తో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి

  • మాజీ స‌ర్పంచులకు భ‌రోసా ఇచ్చిన ఎమ్మెల్యే
  • స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల గెలుపే ల‌క్ష్యంగా స‌మ‌గ్ర ప్ర‌ణాళిక‌
  • కేసీఆర్ హ‌యంలో జ‌రిగిన ప‌నుల‌పై అవ‌గాహ‌న చేప‌ట్టాలని సూచ‌న‌
  • గ్రామ‌స్థాయిలో పార్టీ బ‌లోపేతం కోసం మార్చి 10 నుంచి గ్రామ క‌మిటీల ఏర్పాటుపై నిర్ణ‌యం

నేటి సాక్షి, హుజూరాబాద్ : స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు త్వ‌ర‌లో జ‌ర‌గ‌నుండ‌టంతో ఇప్ప‌టి నుంచే గెలుపే ల‌క్ష్యంగా స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి స‌మ‌గ్ర ప్ర‌ణాళిక రూపొందిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలనే అస్త్రంగా మ‌లుచుకొని స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో గెలుపే ప్ర‌ధాన ధ్యేయంగా తాజా మాజీ స‌ర్పంచులను గెలిపిస్తాన‌ని ఎమ్మెల్యే హామీ ఇవ్వ‌డంతో వారు ధీమాగా మార‌గా, గ్రామ‌స్థాయి నుంచి పార్టీ బ‌లోపేతంపై ఎమ్మెల్యే ప్ర‌ధాన దృష్టి పెట్ట‌గా, ఇందు కోసం మార్చి 10న గ్రామ క‌మిటీలను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌డంతో టీఆర్ ఎస్ పార్టీ మ‌ళ్లీ పున‌ర్ వైభ‌వం సంత‌రించుకోనుంది. శుక్ర‌వారం హుజూరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యంలో హుజూరాబాద్ మండ‌లంలోని బీఆర్ ఎస్ పార్టీ మాజీ స‌ర్పంచులు, ముఖ్య నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి స‌మావేశ‌మ‌య్యారు. ఈ స‌మావేశంలో ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల ముందు ఇచ్చిన హామీల‌ను అధికారంలోకి వ‌చ్చాక వాటిని అమ‌లు చేయ‌కుండా దాట‌వేత దోర‌ణి ప్ర‌ద‌ర్శిస్తున్న వాటిపై గ్రామాల్లో ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సూచించారు. ఇదే స‌మ‌యంలో సీఎం కేసీఆర్ ఉన్న స‌మ‌యంలో గ్రామాల్లో జ‌రిగిన అభివృద్ది గురించి వివ‌రించాల‌ని సూచించారు. స్థానిక సంస్థ‌ల్లో టీఆర్ ఎస్ త‌రుపున పోటీ చేసే ప్ర‌తి అభ్య‌ర్థి గెలుపే ల‌క్ష్యంగా గ్రామ క‌మిటీల ఎన్నిక జ‌ర‌గాల‌ని వెల్ల‌డించారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల తంతు ముగిసిన త‌రువాతి రోజు నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యంలో మాజీ స‌ర్పంచుల‌తో ఎమ్మెల్యే స‌మావేశం నిర్వ‌హించ‌టంతో టీఆర్ ఎస్ నాయ‌కుల్లో పుల్ జోష్ నింపిన‌ట్టుయింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News