Tuesday, March 31, 2026

” అన్విల్లింగ్ ద లైఫ్ సైన్స్ ప్రాస్పెక్టివ్స్ అండ్ ప్లాంట్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్” నేషనల్ సెమినార్ పాల్గొన్న ఎమ్మెల్యే

  • ప్రతి ఒక్కరి బాధ్యత పర్యావరణాన్ని కాపాడాలి

నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : బుధవారం గద్వాల జిల్లా కేంద్రంలోని మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గద్వాల నందు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కలందర్ భాష అధ్యక్షతన బోటనీ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో “అన్విల్లింగ్ ద లైఫ్ సైన్స్ ప్రాస్పెక్టివ్స్ అండ్ ప్లాంట్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్” అనే అంశంపై వన్డే నేషనల్ సెమినార్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే కి కాలేజీ ప్రిన్సిపాల్, లెక్చరర్ శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ… భూమి పైన చెట్లను జంతువులను మొక్కలను పరిరక్షించుకోవాలని, లేకపోతే మానవ మను కూడా ఉండదని, గతంలో గాలి నీరు కొనుక్కోవా లంటే ఆశ్చర్యం పోయే వాళ్ళం కానీ ఇప్పుడు అదికొనుక్కుంటున్నాము.ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో ఆక్సిజన్ నీరు తో పాటు ఇంకా ఏమేమి కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందో అని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కావున పొల్యూషన్ కంట్రోల్ చేస్తూ మొక్కలను జంతువులను పరిరక్షించుకుంటే మానవ మనుగుడా సుఖవంతంగా ఉంటుందని తెలిపారు. గతంలో ప్రభుత్వాలు మొక్కలు పెంచాలని తెలిపారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం కూడా కల్పించిన వల్ల పర్యావరణ ఏర్పడుతుంది కాలుష్యం నివారణ జరుగుతుంది తెలిపారు. ప్రతి ఒక పౌరుడు కనీసం మొక్కలను పెంచాలని వాటిని సంరక్షించాలని కోరారు. బొటానికల్ లిస్ట్ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా స్వర్ణలత మాట్లాడుతూ భూమిని సంరక్షించుకోవాలని లేనియెడల మానవ మనుగడ ఉండదని గ్రాఫి డేసి కుటుంబానికి చెందిన “లైకెన్స్” పై విస్తృతంగా పరిశోధనలు చేస్తున్న విషయాన్ని అలాగే హెర్బెరియంను ఏ విధంగా తయారుచేసి నిల్వ ఉంచుకోవాలో వివరించారు. కో ఫౌండర్ ఆఫ్ బయో జెనిక్ ప్రోడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆఫ్ హైదరాబాద్ డాక్టర్ జి సుధీర్ కుమార్ మాట్లాడుతూ మొక్క యొక్క కాండం, వేర్లు పత్రాల నుంచి మెడిసినల్ ప్రాపర్టీస్ ను ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేయాలో ప్రయోగపూర్వకంగా వివరించారు. చందు బయాలజీ క్లాసెస్ ఫౌండర్ డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ లైఫ్ సైన్స్ విద్యార్థులకు భవిష్యత్తులో కలిగే ఉద్యోగ అవకాశాలను గురించి, పీహెచ్డీ రీసెర్చ్ అంశాలను గురించి దేశంలో ప్రఖ్యాతిగాంచిన వివిధ సంస్థలలో ఉద్యోగ అవకాశాల గురించి వివరించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఔషధ మొక్కలు వాటి ప్రాముఖ్యత, ప్రస్తుత సమాజంలో జనాభాలో వచ్చే వివిధ రుగ్మతలకు మెడిసినల్ ప్లాంట్ ద్వారా ఏ విధంగా నివారించుకోవచ్చునో వివరించి, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ కన్వీనర్స్ మరియు కో కన్వీనర్స్ను నేషనల్ సెమినార్ నిర్వహించిన సందర్భంగా వారిని అభినందించడం జరిగింది. ఉమెన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మీనాక్షి మాట్లాడుతూ… మొక్కలను మొక్కలను జంతువులను పరిరక్షించుకోవాలి వాటి నుండే మనిషికి కావలసిన మెడిసిన్స్, బట్టలు, ఆహార పదార్థాలు మరియు కాస్మోటిక్స్ వంటి ప్రతిదీ కూడా వాటి నుండే పొందడం జరుగుతుంది .కావున చెట్లను జంతువులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేశారు. ఈ సందర్భంగా నేషనల్ సెమినార్ లో వివిధ అంశాలపై పరిశోధన పత్రాలను సమర్పించి పి పి టి ద్వారా ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ జంబు రామన్ గౌడు జిల్లా సీనియర్ నేత గడ్డం కృష్ణారెడ్డి మాజీ ఎంపీపీ విజయ్ మాజీ జెడ్పిటిసి లు పద్మ వెంకటేశ్వర్ రెడ్డి, రాజశేఖర్, వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి,మాజీ కౌన్సిలర్స్ నాగిరెడ్డి నరహరి శ్రీనివాసులు, పూడూరు కృష్ణ శ్రీను, నాయకులు గోవిందు సాయి శ్యామ్ రెడ్డి, సుధాకర్ సుదర్శన్, కురుమన్న, ధర్మ నాయుడు, మోబిన్ , గంట రమేష్, పవన్ యాదవ్ వీరేష్, మొయినుద్దీన్, ప్రవీణ్ మోహన్ యాదవ్, కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కే చంద్రమోహన్ గారు ఐకుఎసి కోఆర్డినేటర్ ఏ రాధిక మేడం గారు నేషనల్ సెమినార్ కన్వీనర్ డాక్టర్ ఎస్ కరుణాకర్ గారు, కో కన్వీనర్ డాక్టర్ ఆర్ నాగేంద్రం, డాక్టర్ జి గణేష్ నాయక్ ,సీనియర్ అద్యాపకులు డాక్టర్ కే సత్తన్న గారు, సత్యమ్మ ,వి సురేందర్ రెడ్డి , ఎంహెచ్ నాగభూషణం గారు తదితర అధ్యాపక బృందం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News