- ఎమ్మెల్యే కి నాయకులు శాలువా కప్పి పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు
నేటి సాక్షి, ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : శనివారం గద్వాల నియోజకవర్గం ధరూర్ మండల పరిధిలోని మార్లబీడు సీ సీ రోడ్డు నిర్మాణానికి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి భూమిపూజ చేసి పనులను ప్రారంభించిన జరిగినది. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో అభివృద్ధి కోసం ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. సీఎం గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు గారు రాష్ట్రంలోని ప్రతి గ్రామాల్లో అభివృద్ధి చెందాలని గ్రామాలలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు సీసీ రోడ్లు డ్రైనేజీ నిర్మాణంలో పూర్తిచేయాలని ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం జరిగినది. భవిష్యత్తులో గ్రామాలను మరింత అభివృద్ధి చేసే విధంగా నా వంతు కృషి చేస్తానని తెలిపారు. త్వరలో రోడ్డు నిర్మాణం పూర్తి చేసే ప్రజలకు అందుబాటులో తీసుకొని రావాలి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయం కమిటీ చైర్మన్ బోయ వెంకటరాములు, మాజీ జెడ్పిటిసి రాజశేఖర్, మాజీ వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీరాములు, రాఘవేంద్ర రెడ్డి, డి.వైస్ రామన్న, ఆనంద్ రెడ్డి, రాఘవేంద్ర రెడ్డి, చంద్రశేఖర్ మహబూబ్, హనుమంతు రెడ్డి, సురేష్ నాయక్, నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.





