Saturday, March 14, 2026

కబడ్డీ విజేతలకు ఎమ్మెల్యే చే బహుమతులు ప్రధానం

నేటిసాక్షిబ్యూరో, నిజామాబాద్, టి.ఎన్ రమేష్ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో, జనవరి నెలలో సంక్రాంతి పండుగ సంబరాల్లో భాగంగా, నిర్వహించిన, మదనన్న కబడ్డీ పోటీలలో, గెలుపొందిన విజేత జట్లకు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ చేతుల మీదుగా, బహుమతులు అందజేయడం జరిగింది. ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి ఆదేశాల మేరకు, మదన్ అన్న కబడ్డీ పోటీలను నిర్వహించిన, మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ ను, ఎమ్మెల్యే మదన్మోహన్ అభినందించారు. మదన్ అన్న కబడ్డీ పోటీలలో గెలుపొందిన హాజీపూర్ తాండ జట్టుకు మొదటి బహుమతిగా, 51,000 ల రూపాయలు బహుమతిగా ప్రధానం చేయడం జరిగింది. రెండవ బహుమతిగా ఎల్లారెడ్డి (A) జట్టుకు 21,000 వేల రూపాయలు బహుమతిగా అందించడం జరిగింది. మూడవ బహుమతిగా 11,000 వేల రూపాయలు, జాయింట్ టీం భిక్కనూరు మరియు పెద్ద రెడ్డి వారికి, బహుమతులతో పాటు ప్రైజ్ మనీని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్మోహన్ మాట్లాడుతూ, రిపబ్లిక్ డే పురస్కరించుకొని ఎల్లారెడ్డి పట్టణంలో అర్హులైన ఇల్లు లేని పేదలకు, 300 డబల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించడం జరుగుతుందని మదన్మోహన్ తెలిపారు. త్వరలోనే మినీ ట్యాంక్ బండ్ పై అమరులు మరియు స్వర్గస్తులైన ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేల విగ్రహాలను, సైతం ఏర్పాటు చేస్తామని, క్యూఆర్ కోడ్ పద్ధతి ద్వారా అమరులైన మాజీ ఎమ్మెల్యేల జీవిత చరిత్రను పొందుపరుస్తామని, ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు ప్రజలు కబడ్డీ పోటీ విజేతలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News