- అవ్వ తాతలకు వికలాంగులకు అండగా కూటమి ప్రభుత్వం
- ఎన్ని ఇబ్బందులు ఉన్నా అధిగమించి సామాజిక పెన్షన్ ఒకటవ తారీఖున అందిస్తుంది
- ప్రతీ నెల 1వ తేదీ ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ చేస్తున్న కూటమి ప్రభుత్వం
నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల)చంద్రగిరి : ఫిబ్రవరి 1వ తేదీ ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ ను అవ్వ, తాత, వికలాంగులకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చేతుల మీదుగా చంద్రగిరి మండలం పరిధిలోని ముంగిలపట్టు పంచాయతీ కొంగరవారిపల్లిలో అధికారులు, కూటమి పార్టీ మండల నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ ఫిబ్రవరి 1వ తేదీన కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమం 100% పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. పెన్షన్ దారులు ఇంటి వద్దనే ఉండి పెన్షన్ తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే గారు కోరారు. ప్రజల కష్టాలను, సమస్యలు తెలిసినవారు కాబట్టే మా పెద్దాయన నారా చంద్రబాబు నాయుడు ప్రతి నెల 1వ తేదీన క్రమం తప్పకుండా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేయడం జరిగుతుందని కక్షపూరితమైన రాజకీయాలకు తావు లేకుండా చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పల్లినేని సుబ్రహ్మణ్యం నాయుడు, సతీష్ నాయుడు, బాలకృష్ణ మూర్తి నాయుడు, వెంకట ముని,అధికారులు, కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





