Monday, March 16, 2026

తొండవాడ లే అవుట్ లో తెలుగు దేశం పార్టీ కార్యాలయంను ప్రారంభించిన ఎమ్మెల్యే పులివర్తినాని

  • ప్రజా సమస్యలు తీర్చేందుకు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఏర్పాటు
  • చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని

నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల) : నందమూరి తారక రామారావు నగర్ లో ప్రజా సమస్యలను త్వరితగతిన తీర్చడానికి ఈ కార్యాలయం పనిచేస్తుందని తెలిపిన ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు శుక్రవారం చంద్రగిరి మండలం పరిధిలోని తొండవాడ పి.యం.ఎ.వై, ఎన్టీఆర్ నగర్ లో నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికిన కూటమి నాయకులు, కార్యకర్తలు. నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం ప్రజలనుండి అర్జీలను స్వీకరించారు. పార్టీ కార్యాలయం ప్రారంభం అనంతరం ఆయన మాట్లాడుతూ తొండవాడ పి.యం.ఎ.వై, ఎన్టీఆర్ నగర్ లోనీ ప్రజా సమస్యలపై ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా త్వరితగతిన తీర్చడానికి ఈ కార్యాలయం లోని సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. ఎన్టీఆర్ నగర్ లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పార్టీలకు అతీతంగా ప్రజలు వచ్చి అర్జీ రూపంలో తమ సమస్యను పార్టీ కార్యాలయంలో ఇస్తే ఆ సమస్యను సిబ్బంది నా దృష్టికి తీసుకువచ్చిన వెంటనే అర్జీలను సంబంధించిన శాఖ అధికారులకు పంపించి సమస్యను పరిష్కారం అయ్యేవిధంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పల్లినేని సుబ్రహ్మణ్యం నాయుడు, సీనియర్ నాయకులు ఇరంగారి రమేష్ రెడ్డి, మొక్కల కుమార్ రాజా రెడ్డి , మొక్కల చంద్రశేఖర్ రెడ్డి, గౌస్ భాషా, బాలకృష్ణ మూర్తి నాయుడు, ఆకుల ప్రభాకర్ నాయుడు, లంకెల లలిత, తులసీశ్వర్ రెడ్డి, జయచంద్ర రెడ్డి,వినోద్ కుమార్ రెడ్డి, ఐతే పల్లి వెంకట ముని, పిచ్చి నాయుడు పల్లి హరి, రవితేజ యాదవ్, బిజెపి నాయకులు వెంకట ముని,జనసేన నాయకులు తపసి మురళి రెడ్డి, అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News