నేటి సాక్షి, మెట్ పల్లి (నరేష్.దులూరి) : పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల, పట్టణానికి చెందిన 76 మంది లబ్ధిదారులకు 23,47,000/- ఇరవై మూడు లక్షల నలపై ఏడువేల రూపాయల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అందజేశారు. ఈ సందర్భంగా చెక్కుల మంజూరుకు కృషిచేసిన ఎమ్మెల్యేకు లబ్దిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రణవేని సుజాత, వైస్ చైర్మన్ చంద్రశేఖర రావు, మాజీ ఎంపీపీ మారు సాయి రెడ్డి, సందిరెడ్డి శ్రీనివాస్, కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.





