నేటి సాక్షి – జగిత్యాల బ్యూరో : జగిత్యాల జిల్లా కేంద్రంలోని మడేలేశ్వర స్వామి ఆలయ సమీపంలో కీ.శే గోగికార్ రాములు మరియు కీ.శే గోడికె శంకర్ వారి జ్ఞాపకార్థంగా చలివేంద్రాన్ని గురువారం స్థానిక శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఎండల తీవ్రత నుండి ఉపశమనం పొందాలంటే త్రాగునీరు ఎంతో ఉపయోగమని వారు తెలిపారు. నిత్యం జాతీయ రహదారి పై వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుండడం వాహనదారులకు ఇలాంటి చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడుతుందని వారు అభిప్రాయ వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వహకులు గోగికార్ మహేందర్,గోలి శ్రీనివాస్ పంబాల రాము, భూమన్న సీపెల్లి రవీందర్,సుధాకర్,కిషోర్ సింగ్, రాజు(లింబాజీ) భరత్, అజయ్, సుమన్ తదితరులు ఉన్నారు.





