నేటి సాక్షి రామడుగు (పురాణం సంపత్): స్టేట్ లెవల్ తైక్వాండో పోటీల్లో రామడుగు మండలం వెలిచాల సరస్వతి ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు సత్తాచాటినట్లు హెచ్ఎం ఉప్పుల శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాద్లో ఈ నెల 1,2వ తేదీల్లో జరిగిన పోటీల్లో 13 మంది విద్యార్థులు పాల్గొనగా ఈగ అశ్విత్కుమార్ గోల్డ్ మెడల్, బండపల్లి మేఘన బ్రాంజ్ మెడల్, రేగూరి శ్రీహాసిని బ్రాంజ్ మెడల్, పెద్దిగారి సింధు బ్రాంజ్ మెడల్ సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. తైక్వాండో పోటీల్లో సత్తాచాటిన విద్యార్థులను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సోమవారం అభినందించి నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వెలిచాల మాజీ సర్పంచ్ వీర్ల నర్సింగరావు, స్కూల్ కో కరస్పాండెంట్ ఉప్పుల సత్యం, కోచ్ శరత్, టీచర్స్ పాల్గొన్నారు.




