Sunday, March 15, 2026

నూతన అంబులెన్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి

  • ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం
  • ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి

మెదక్ జిల్లా కొల్చారం.నేటి సాక్షి (భూమయ్య ) : మండల కేంద్రమైన కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకుని నూతన అంబులెన్స్ ను పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం దవాఖానాలోని ప్రతి గదిని తిరిగి చూశారు. దావఖానలో అందిస్తున్న వైద్య సేవలు, మందులు, సిబ్బంది వివరాలను డాక్టర్ రమేష్ ను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ సిబ్బంది కొరత ఉన్నట్లు ఎమ్మెల్యేకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో జిల్లా మంత్రిని కోరగానే కొల్చారం వెల్దుర్తి మండలాలకు రెండు అంబులెన్స్లను మంజూరు చేశారని తెలిపారు. కొల్చారంలో రోడ్డు ప్రమాదాలు జరిగితే అంబులెన్స్ రావడానికి చాలా సమయం పట్టేదని, ఇప్పుడు ఆ సమస్య తీరింది అన్నారు. కొల్చారంలో ప్రసూతి సేవలు ప్రారంభించాలని అందుకు కావలసిన సదుపాయాలను, ఇతర అవసరాలను తనకు లేక ద్వారా అందించాలని డాక్టర్ రమేష్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ గఫర్ మియా, ఆర్ఐ ప్రభాకర్, ఎం పి హెచ్ ఈ ఓ మదన్మోహన్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గౌరీ శంకర్ గుప్తా, మాజీ జెడ్పిటిసి కాశం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా నాయకులు ముత్యం గారి సంతోష్ కుమార్, తుంకులపల్లి సంతోష్ రావు, కరెంటు రాజా గౌడ్, సిహెచ్ కృష్ణ, వై కృష్ణ, చిన్న రాములు, లింగోల చెన్నయ్య, సాయిబాబాగౌడ్, వినోద్ నాయక్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News