Monday, January 19, 2026

ఎమ్మెల్యేకు బెదిరింపు.. 20 లక్షల డిమాండ్

  • నిందితుపై కేసు నమోదు
  • లుక్ ఔట్​ నోటీసు జారీ
  • కరీంనగర్ రూరల్ ఏసీపీ వెంకటరమణ

కనేటి సాక్షి, కరీంనగర్ : ఎమ్మెల్యేకు బెదిరింపులకు పాల్పడడంతో పాటు డబ్బులు డిమాండ్​ చేసిన నిందితుడిపై కేసు నమోదు చేసినట్టు కరీంనగర్​ రూరల్​ ఏసీపీ వెంకటరమణ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన వివరాల ప్రకారం.. కరీంనగర్​ కమిషనరేట్ పరిధిలోని చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు గత సెప్టెంబర్ నెలలో 28న మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో +447886696497 నుండి వాట్సాప్ ద్వారా ఫోన్ కాల్ వచ్చింది. అందులో నిందితుడు కాల్​లో మాట్లాడుతూ తనకు రూ.20 లక్షలు చెల్లించాలని, లేని పక్షంలో ఎమ్మెల్యేను రాజకీయంగా అప్రతిష్టపాలు చేస్తానని, ఆయన గౌరవానికి భంగం కలిగే చర్యలకు పాల్పడతానని బెదిరించాడు. ఎమ్మెల్యే ఇద్దరు పిల్లలను అనాథలు అయ్యేలా చేస్తానని వార్నింగ్​ ఇచ్చాడు. దీంతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కొత్తపల్లి పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. మేరకు 339/2024 , భారతీయ న్యాయ సంహింత 308, 351(3), (4) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసుపై విచారణ జరిపిన పోలీసులు నిందితుడు రంగారెడ్డి జిల్లా బోడుప్పల్​లోని భవానీనగర్​కు చెందిన యాస అఖిలేష్ రెడ్డి (33)గా గుర్తించారు. అతడు ప్రస్తుతం లండల్​లో ఉన్నాడని, అక్కడి నుంచి బెదిరింపులకు పాల్పడ్డాడని ఏసీపీ తెలిపారు. సదరు నిందితుడిపై బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ ద్వారా లుక్ అవుట్ సర్య్కూలర్​ జారీ చేశామని కరీంనగర్ రూరల్ ఏసీపీ వెంకటరమణ వివరించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News