- ఆశ్రమంలో విద్యార్థులతో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చిన్నారులతో సందడి చేశారు

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి :
వనపర్తి జిల్లా చిట్యాల గ్రామంలో చేయూత ఆశ్రమంలో ఎమ్మెల్యే చిన్నారులతో సందడి చేశారు. ప్రతి ఒక్కరి పట్ల ఆప్యాయత అనురాగాలు పంచే ఎమ్మెల్యే మేఘారెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన చేయూత ఆశ్రమ విద్యార్థులు. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తన పుట్టినరోజు వేడుకలను వనపర్తి మండలం చిట్యాల గ్రామ శివారులో గల చేయూత అనాధ ఆశ్రమంలో జరుపుకున్నారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి తన సతీమణి శారదా రెడ్డి విద్యార్థులతో కలిసి కేకును కోసి విద్యార్థులకు తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. చేయూత ఆశ్రమం ఆర్గనైజర్ శ్రీనివాస్ రెడ్డి దంపతులు ఎమ్మెల్యే కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు, అనంతరం విద్యార్థులకు నోట్ పుస్తకాలను పెన్నులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే చిన్నారులకు మీరు బాగా చదువుకొని మంచి ప్రయోజకులు కావాలని అన్నారు. పిల్లలు బదులు ఇస్తూ మేము బాగా చదువుకొని మా ఆశ్రమానికి జిల్లాకు మంచి పేరు తీసుకువస్తామని చిన్నారులు అన్నారు.
విద్యార్థులు ముక్తకంఠంతో ఎమ్మెల్యే కి జన్మదిన శుభాకాంక్షలు చేసిన విద్యార్థులతో ఎమ్మెల్యే సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.





