నేటి సాక్షి ప్రతినిధి, రుద్రంగి : బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఆయన రుద్రంగి మండల తాసిల్దార్ కి లేఖ రాశారు. రుద్రంగి మండలం మానాల గ్రామంతో పాటు గిరిజన తాండ గ్రామ పంచాయతీలకు సంబంధించిన 14 కళ్యాణ లక్ష్మి చెక్కులు మంజూరైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యేను అధికారులు ఆహ్వానించినట్లు తెలిపారు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.లక్ష చెక్కుతో పాటు తులం బంగారం ఇవ్వనందుకు నిరసనగా కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు పేరొన్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శుల ద్వారా లబ్ధిదారులకు చెక్కులు అందించాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు పెళ్లి చేసుకున్న అందరికీ చెక్కులతో పాటు తులం బంగారం అందించాలని డిమాండ్ చేశారు.




