Thursday, March 12, 2026

అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే విజయరమణా రావు

నేటి సాక్షి,పెద్దపల్లి (వోడ్నాల తిరుపతి) : పెద్దపల్లి పట్టణం లో అభివృద్ధిలో భాగంగా (టియుఎఫ్ఐడిసి) నిధుల ద్వార చాకలి ఐలమ్మ విగ్రహం నుండి జెండాచౌరస్తా వరకు జెండా చౌరస్తా నుండి సుభాష్ నగర్ చౌరస్తా వరకు జరుగుతున్న పనులను శనివారం రోజున పరిశీలించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పెద్దపల్లి పట్టణంలోని అన్ని వార్డులు అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది అని పనులలో నాణ్యత పాటించాలని ఎక్కడ కూడా పొరపాట్లు లేకుండా చూడాలని గుత్తేదారులను ఆదేశించారు పెద్దపల్లి పట్టణ అభివృద్ధికి సహకరిస్తున్న పట్టణ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తేలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మున్సిపల్ నూతన కార్యాలయాన్ని అకస్మికంగా పరిశీలించారు. ఎమ్మెల్యే ని ఇటీవల గ్రూప్ 4 ద్వారా వచ్చినటువంటి ఉద్యోగులు పూల బొకేతో ఎమ్మెల్యే ని సన్మానించారు. ఎమ్మెల్యే వారితో మాట్లాడుతూ.. ఉద్యోగ కర్తవ్యం సక్రమంగా నిర్వహిస్తూ పెద్దపల్లి పట్టణానికి మంచి పేరు తేవాలని అన్నారు.ఈకార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, ఏసీపీ గజ్జి కృష్ణ, సిఐ ప్రవీణ్, ఎస్ఐ లక్ష్మణరావు, కౌన్సిలర్లు నూగిల్ల మల్లయ్య, భూత గడ్డ సంపత్, పాగాల సోనీ శ్రీకాంత్, తుముల సుభాష్, తాడూరి పుష్పకళా శ్రీమాన్, పైడ పద్మ రవి, బొంకురి భాగ్యలక్ష్మి సన్నీ, మున్సిపల్ మేనేజర్ శివప్రసాద్, ఏఈ సతీష్, టౌన్ ప్లానింగ్ అధికారి వినయ్ మున్సిపల్ సిబ్బంది పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News