
నేటి సాక్షి,పెద్దపల్లి (వోడ్నాల తిరుపతి):
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామంలోని స్వాతంత్ర సమరయోధులు ఇరవెల్లి రంగా రావు మరణించడంతో శుక్రవారం రోజున ఉదయం వారి నివాసానికి వెళ్లి స్వర్గీయ రంగా రావు భౌతిక కాయనికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం ఓదెల, కొమిరే, పోత్కపల్లి గ్రామాలల్లో ఇటీవల కాలంలో మరణించిన వారి చిత్రపాటలకు పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, ఓదెల మండల అధ్యక్షులు సాగర్ రెడ్డి, పోత్కపల్లి మార్కెట్ చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





