- వేముల ప్రశాంత్ రెడ్డి

నేటి సాక్షి ప్రతినిధి, రుద్రంగి : ఉమ్మడి మానాల గ్రామంలో పలువురు ఆత్మీయ కుటుంబ సభ్యులను కోల్పోవడంతో వారిని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. అడ్డబోర్ తండాకు చెందిన ఆత్మీయులు లౌడ్య నారాయణ భార్య జేని బాయ్ ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బడి తండాకు చెందిన గుగులోత్ రవి తండ్రి గోవింద్ అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబం సభ్యులను, సర్పంచ్ తండా కు చెందిన గుగులోత్ రామ్ సింగ్ మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

