నేటి సాక్షి, చెన్నూర్ టౌన్ : చెన్నూర్ పట్టణంలో శుక్రవారం రోజు పర్యటించిన ఎమ్మెల్యే వివేక్ ముందుగా నూతనంగా ఏర్పాటు చేసిన కిడ్స్ ప్లే జోన్ ను ప్రారంభించారు. అనంతరం పట్టణంలోని దేవర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఓంకార ఆద్య అనే బాలిక వైద్యానికి రూ. 1లక్ష 50వేలు ఎల్వోసీ కుటుంబ సభ్యులకు అందజేసారు. ఎంఆర్ఆర్ గార్డెన్స్ లో మంచిర్యాల జిల్లా బిజెపి అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ కుమార్తె వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.





