Friday, March 20, 2026

యశస్వి హాస్పిటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యేలు

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : హన్మకొండ పట్టణం లోని 53 వ డివిజన్ భీమారం ప్రధాన రహదారి లో నూతనంగా ఏర్పాటు చేసిన యశస్వి హాస్పిటల్ ను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి మరియు వర్ధన్నపేట నియోజక వర్గ ఎమ్మెల్యే కె. ఆర్ నాగరాజు డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి రెడ్యా నాయక్ లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో కష్టపడి చిన్న వయసులోనే డాక్టర్ వృత్తిని చేపట్టి పేదలకు సహ్రుదయం తో సేవ చేయాలనే సదుద్దేశం తో హాస్పటల్లో స్థాపించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా హాస్పటల్ డాక్టర్లు అయినా డాక్టర్ చైతన్య డాక్టర్ పృథ్వీరాజ్ రాథోడ్ లకు శుభాకాంక్షలు తెలిపారు డాక్టర్ చైతన్య మాట్లాడుతూ పేదలకు సేవ చేయాలని ఆలోచనతో ఈ డాక్టర్ వృత్తిని స్వీకరించడం జరిగిందని పేదలకు అందుబాటులో ఉంటూ లాభాపేక్ష లేకుండా స్వచ్ఛమైన వైద్య సేవలను అందిస్తామని డాక్టర్ చైతన్య అన్నారు డాక్టర్ పృథ్విరాజ్ రాథోడ్ మాట్లాడుతూ అందరికీ అందు బాటులో ఉండే ఆధునాతనమైన వైద్య సేవలను అందిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు నాయకులు పులి అనిల్ కుమార్ కార్పొరేటర్లు సిరంగి సునీల్ కుమార్, జక్కుల రజిత, డివిజన్ అధ్యక్షులు కొంక హరిబాబు మన్నె బాబురావు గడ్డం శర్మ శివరాం ప్రసాద్ చల్ల సుమంత్ యాదవ్ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు మరియు వరంగల్ ప్రముఖ న్యాయవాది అరుణ్ కుమార్ జాతీయ సైన్ సభ్యులు జై సింగ్ రాథోడ్ మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News