Sunday, March 22, 2026

పాత్రికేయుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

నేటి సాక్షి, జమ్మికుంట

జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు నినాదం దినపత్రిక హుజురాబాద్ ఆర్సి ఇంచార్జ్ అయిత రాధాకృష్ణ మాతృమూర్తి అయిత రాజ్యలక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. నినాదం దినపత్రిక హుజురాబాద్ ఆర్ సి ఇన్చార్జిగా పనిచేస్తున్న రాధాకృష్ణ కుటుంబ సభ్యులను విలాసాగర్ గ్రామంలో పరామర్శించి రాజ్యలక్ష్మి చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వెంకట్ మాట్లాడుతూ, రాధాకృష్ణ కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు అండగా ఉండాలని ఆ మాతృమూర్తి మరణం ఆ కుటుంబానికి తీరని లోటు అని పేర్కొన్నారు. భవిష్యత్తులో వారికి వారి కుటుంబానికి అండగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కసుబోజుల వెంకన్న ఎండి సలీం భాష మాజీ మార్కెట్ డైరెక్టర్ సలీం ఎగ్గని శ్రీనివాస్ రాకేష్ ఉమ్మడి సందీప్ చిన్నాల శ్రీకాంత్ యాదవ్ మాధవరావు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News