Monday, March 23, 2026

ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్, నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి

  • బ్రిడ్జి జేఏసీ చైర్మన్ సంపతి ఉదయ్ కుమార్

నేటిసాక్షి, గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్): గన్నేరువరం మండలకేంద్రంలో విలేకరుల సమావేశంలో బ్రిడ్జి జేఏసీ చైర్మన్ సంపతి ఉదయ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్, నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీగా నరేందర్ రెడ్డి గెలిపించు కోవాల్సిన చారిత్రక అవసరం పట్టభద్రులపై ఉందన్నారు. పోటీలో ఉన్న ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో సేవ చేసే గుణం, పనులు చేసి పెట్టే సత్తా ఎవరికి ఉందో పట్టభద్రులు బేరీజు వేసుకోవాలని, ఓటు వేసే విషయంలో విజ్ఞతను ప్రదర్ళించాలని ఆయన పట్టభద్రులను కోరారు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నరేందర్ రెడ్డి అధ్యాపక వృత్తి చేపట్టి విద్యాసంస్థల అధిపతి వరకు ఎదిగారని, ఎంతో పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించడమే కాకుండా ఫీజుల్లోనూ రాయితీ కల్పిస్తున్నారని, అన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News