నేటి సాక్షి, మందమర్రి:- ఉమ్మడి కరీంనగర్ మెదక్ అదిలాబాద్ నిజాంబాద్ పట్టభద్రుడా ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్న వి. నరేందర్ రెడ్డి ప్రచార బ్యానర్లకు మందుబాబులు మద్యం లేగులతో తిలకం దిద్దిన ఘటన పట్టణంలో సంచలనం సృష్టిస్తుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గత రెండేళ్లుగా విస్తృత ప్రచారం చేస్తున్న కరీంనగర్ పట్టణానికి చెందిన ఆల్ కోర్స్ విద్యాసంస్థల అధినేత ఓటూరు నరేందర్ రెడ్డి నాలుగు జిల్లాల పరిధిలో ప్రచార ఓటింగ్లతో ఫ్లెక్సీలు అంతర్గత సమావేశాలతో ముమ్మర ప్రచారం చేపడుతున్నారు. దీనిలో భాగంగా మందమర్రి పట్టణంలోని ప్రధాన కూడళ్లలో పాటు కోల్బెల్ట్ రహదారి వెంట భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ఓటర్లను కూడా అభ్యర్థిస్తున్నారు. ఇది ఇలా ఉండగా నరేందర్ రెడ్డి ప్రచార ఫ్లెక్సీ కి మందుబాబులు మద్యం లేబులతో తిలకం దిద్దిన ఘటన దర్శనం ఇవ్వడం పట్ల పలువురు విద్యావంతులు మందుబాబుల తీరుపై మండిపడుతున్నారు. ఏదేమైనప్పటికీ ఉన్నత విద్యావంతుని ప్రచార ఫ్లెక్సీ కి మద్యం లేబులతో తిలకం దిగడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.




