Friday, March 20, 2026

ఎమ్మెల్సి అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలి

నేటి సాక్షి, మెట్ పల్లి (గోరుమంతుల నరేందర్): కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సి అభ్యర్థి కుట్కూరి నరేందర్ రెడ్డిని గెలిపించాలని కోరుట్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి జువ్వాడి నర్సింగ రావు అన్నారు. శుక్రవారం వెంక రెడ్డి గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి కూట్కూరి నరేందర్ రెడ్డి గెలిపించాలని పట్టభద్రుల ముఖ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కోరుట్ల ఇంచార్జి జువ్వాడి నర్సింగారావు అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి పుట్కూరి నరేంద్ర రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని పట్టా భద్రుల సమస్యలు పరిష్కారానికి ఆయన కృషి చేస్తారని అన్నారు. ఆల్ ఫోర్స్ ద్వారా ఎంతోమంది పట్టభద్రులకు ఉపాధి కల్పిస్తున్నారని దాదాపు ఐదు వెల మంది వరకు ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల్లో ఉన్నారని వారికి పట్టభద్రుల సమస్యలు అవగాహన ఉన్నదని అన్నారు. తప్పకుండా మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి పట్టభద్రుల తరఫున గెలిపించాలని కోరారు.కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని మీకు ఏ సహాయం కావాలన్నా మీకు అండగా ఉంటామని అన్ని విధాల మీ సమస్యలకు ముందుండి పరిష్కరిస్తామని తెలిపారు.ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఒకసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వండి మీ సమస్యలు ముందుండి పరిష్కరిస్తారని మీ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటు తనకు వేసి గెలిపించాలని మీ సమస్యలు పరిష్కరిస్తారని అన్నారు. నాపై నమ్మకం పెట్టి నాకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి గెలిచి కానుకగా ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి, పట్టణ అధ్యక్షులు జెట్టి లింగం, మండల అధ్యక్షులు తిప్పిరెడ్డి అంజిరెడ్డి, మాజీ జెడ్పీసీలు ఆకుల లింగారెడ్డి, జలపతి రెడ్డి,శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరి మహేందర్ రెడ్డి, బోర్గం రాజు, ఎర్రోళ్ల హన్మాండ్లు, తిరుపతి, దేవేందర్ పట్ట భద్రులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News