Sunday, March 22, 2026

కోరుట్ల బార్ అసోసియేషన్ సభ్యులను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి సర్ధార్ రవీందర్ సింగ్

నేటి సాక్షి, కోరుట్ల టౌన్ (గణేష్ గొల్లపల్లి): ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం జగిత్యాల జిల్లా కోరుట్ల కోర్టులోని బార్ అసోసియేషన్ న్యాయవాదులను కరీంనగర్ మాజీ మేయర్ , రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ , కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి సర్ధార్ రవీందర్ సింగ్ కలిశారు. ఈ సందర్భంగా రవీందర్ సింగ్ మాట్లాడుతూ కరీంనగర్ మాజీ మేయర్ గా, రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందజేశానన్నారు. ఒక్క రూపాయికే అంతిమయాత్ర, నల్ల కనెక్షన్, సరస్వతి ప్రసాదం వంటి పథకాలు అమలు చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపించిన వెంటనే పట్టభద్రుల సంక్షేమం కోసం కేవలం ఒక్క రూపాయికే 5 లక్షల ఇన్సూరెన్స్ స్వయంగా భీమా అందజేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత (1) ఓటును తనకు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు తన్నీరు శ్రీనివాస్ రావు, సెక్రటరీ సుతారి శ్రీనివాస్, కోశాధికారి చిలువేరి రాజశేఖర్, న్యాయవాదులు కటుకం శ్రీధర్, కడకుంట్ల సదాశివరాజు, కొంపెల్లి సురేష్, నవీన్, అల్లె రాము, ప్రేమ్ సాగర్, సంగ విజయ్ సాయి, గోసికొండ సురేష్, వురడి నరేందర్, ఓర్సు రాములు, ఉమ, దీపా తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News