Tuesday, March 24, 2026

ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

నేటి సాక్షి , మునగాల : నల్లగొండ, ఖమ్మం, వరంగల్ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం మునగాల మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాల లో ఏర్పాటుచేసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని కోదాడ ఆర్డిఓ సూర్యనారాయణ పర్యవేక్షించారు. పోలింగ్ కేంద్రం వద్ద పోలీసుల పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికలు ముగిసే సమయానికి పురుషులు 40 మంది మహిళలు 16 మంది మొత్తం 56 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని 86.15 శాతం పోలింగ్ జరిగిందని తెలియపరిచారు. పర్యవేక్షణలో ఎమ్మార్వో ఆంజనేయులు సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News