Sunday, March 29, 2026

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటివి

  • ఉద్యోగులు, పట్టభద్రులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు
  • బిజెపికి అండగా నిలిచిన పట్టబద్రులు, ఉద్యోగ ఉపాధ్యాయులకు ధన్యవాదాలు
  • బీజేవైఎం రాష్ట్ర నేత సింగిరాల రామరాజు

నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు): ఉమ్మడి కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి తీర్పు వచ్చిందని, ఉద్యోగ ఉపాధ్యాయులు, పట్టభద్రులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర నాయకులు సింగిరాల రామరాజు అన్నారు. గురువారం రోజున హుజురాబాద్ లో ఆయన మాట్లాడుతూ జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపికి అండగా నిలిచి, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమరయ్య, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి చారిత్ర కవిజయాన్ని చేకూర్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. అలాగే బిజెపి అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు కష్టపడి పని చేసి విజయం కోసం కృషిచేసిన బిజెపి శ్రేణులు అందరికీ, అనుబంధ విభాగాలకు, సంస్థలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను, పట్టభద్రులను మోసం చేసిందని, అందుకే ఈ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సర్కార్ కి ఉద్యోగ ఉపాధ్యాయులు, పట్టభద్రులు తగిన గుణపాఠం చెప్పారన్నారు. ముఖ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయులు, పట్టభద్రులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు మనగడ సాధించలేదని, కాంగ్రెస్ సర్కార్ పతనానికి కౌంట్ డౌన్ మొదలైందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన నాలుగు ఉమ్మడి జిల్లాల్లో భారతీయ జనతా పార్టీ తిరుగులేని శక్తిగా అవతరించిందన్నారు. కాంగ్రెస్, బి ఆర్ఎస్ ఒక్కటై ఈ ఎన్నికల్లో బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థులను ఓడించడానికి ఎన్ని కుట్రలు చేసినా పట్టభద్రులు, టీచర్స్ తిప్పి కొట్టారన్నారు. తెలంగాణలో ఆ రెండు పార్టీలకు ఇక రాజకీయ భవిష్యత్తు లేదని, ప్రజలంతా బిజెపి వైపు చూస్తున్నారని, జరగబోయే ఏ ఎన్నికలైనా బిజెపి శక్తి చాటి చెబుతామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News