- పోలీసుశాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు..
- ఓటేసిన ప్రజాప్రతినిధులు, యువకులు..
నేటి సాక్షి ప్రతినిధి, చందుర్తి/ రుద్రంగి
పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ స్థానాల కోసం జిల్లా వ్యాప్తంగా 41 కేంద్రాలు ఏర్పాటు చేసి పోలింగ్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా గురువారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
వేములవాడ నియోజకవర్గంలోని చందుర్తి , రుద్రంగి మండల కేంద్రాలలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ లో అధిక శాతం ఓట్లు పోలయ్యాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఓటు వేయడానికి రుద్రంగి మండలకేంద్రంలో మాజీ ఎంపీపీ గంగం స్వరూప మహేష్, బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు నంద్యాడపు వెంకటేష్, మాజీ సర్పంచ్ తర్రె ప్రభలత మనోహర్, మాజీ ఎంపీటీసీ చేప్యాల రవలిక సంజీవ్, మాజీ ఎంపీటీసీ రాజు నాయక్, బిఆర్ యస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు దయ్యాల కమలాకర్, చేప్యాల గణేష్ చెందిన పట్టభద్రులు పోలింగ్ కేంద్రానికి వెల్లి స్వేచ్ఛగా వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
- చందుర్తి లో…
చందుర్తి మండలంలోని 947 మంది పట్టభద్రులు ఓటు హక్కు కలిగి వుండగా 707 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించు కోగా 28 మంది ఉపాద్యాయులు ఉపాద్యాయ ఎమ్మెల్సీ కి ఓటు హక్కు కలిగి వుంటే 28 మంది ఉపాద్యాయులు తమ ఓటును నచ్చిన వారికి వేసి రాజ్యాంగం కల్పించిన ఓటు విలువను కాపాడారు.పట్టద్రులు 73.49%, ఉపాధ్యాయులు 100% పోలింగ్ నమోదంది.
- రుద్రంగిలో 100% నమోదు..
రుద్రంగి మండలంలో 392 మంది పట్టభద్రులు ఓటు హక్కు కలిగి ఉండగా 315 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 18 మంది ఉపాధ్యాయులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటు హక్కు కలిగి ఉంటే 18 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టద్రులు 81.12%, ఉపాధ్యాయులు 100% పోలింగ్ నమోదంది.




