నేటి సాక్షి, మందమర్రి:-
కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెద్దపల్లి సత్యనారాయణ ఆదివారం పట్టణంలోని మార్కెట్ ప్రాంతంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలువురిని కలిసి, పట్టణానికి చెందిన తనను ఎమ్మెల్సీ గా గెలిపించాలని కోరారు. విద్యావంతునిగా, సామాజిక ఉద్యమాలు నడిపిన తాను ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనార్టీ, వికలాంగుల హక్కుల కోసం నిరంతరం పాటుపడుతున్న తనకు జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సింది కోరారు.





