Sunday, March 15, 2026

ఆధునిక సాంకేతిక విజ్ఞానము నిత్యజీవితముతో అనుసంధానం

ఉస్మానియా యూనివర్సిటీ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగ ప్రొఫెసర్ డాక్టర్ ఎల్ శివరామకృష్ణ

నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
నూతన శాస్త్రయ సాంకేతిక విజ్ఞానంలో మానవ జీవితంలో ఒక భాగం అని మానవ జీవిత రాని అనుబంధమును కలిగి ఉన్నదని ఉస్మానియా యూనివర్సిటీ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగ ప్రొఫెసర్ డాక్టర్ ఎల్ శివరామకృష్ణ అన్నారు. కమల ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ సింగాపురంలో జరుగుతున్న అటల్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ లో రెండవ రోజు శిక్షణా కార్యక్రమం నకు ముఖ్య శిక్షకుడిగా హాజరయ్యారు. డాక్టర్ శివరామకృష్ణ (Role of Industry-4.0 for sustainable development) రోల్ ఆఫ్ ఇండస్ట్రీ 4.0 ఫర్ సస్టేనబుల్ డెవలప్మెంట్ అనే అంశం మీద శిక్షణ ఇచ్చారు. శివరామకృష్ణ మాట్లాడుతూ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఆటోమేషన్ , రోబోటిక్ విభాగాలు క్రియాశీలకంగా ఉన్నాయని మ్యానుఫ్యాక్చరింగ్ అనేది యంత్రములు స్వతంత్ర నిర్ణయాలు తీసుకొని వస్తువులను ఉత్పత్తి చేసే విధంగా ఉన్నాయని అందువలన వస్తు ఉత్పత్తి నాణ్యత పెరుగుతుందని అన్నారు .సరికొత్త విజ్ఞానములు అయిన కంప్యూటర్ విజ్ఞానము ను అన్ని రంగాలలో ఉపయోగిస్తున్నారని ,మెకానిక్ ఇంజనీరింగ్ విద్యార్థులు, అధ్యాపకులు మెకానికల్ సాఫ్ట్వేర్ నేర్చుకొని వాటిని మెకానికల్ యంత్రాలను నడపడంలో ఉపయోగించాలని బోధించారు. మెకానికల్ ఇంజనీరింగ్ పరిజ్ఞానమును వస్తు ఉత్పత్తి మాత్రమే కాకుండా ఆధునిక వ్యవసాయ రంగము, వైద్య విధానము మొదలగు వాటిల్లో ఉపయోగిస్తున్నారని, ఒక కార్మికుడు యంత్రము దగ్గరకు వెళ్లకుండానే దూర ప్రాంతం నుండే చేతిలో పట్టుకొనే చిన్న పరికరాలతో యంత్రాలను నడిపిస్తున్నారని వివరించారు. వివిధ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలలో మానవుని యొక్క ప్రత్యక్ష పాత్రను క్రమక్రమంగా తగ్గిస్తున్నాయని వివరించారు. వస్తు ఉత్పత్తిని సులభతరం చేసి నాణ్యమైన వస్తువులను ఉత్పత్తి చేసి మానవ జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా చేయుటయే ఇండస్ట్రీ 4.0 లక్ష్యం అని శివమొచ్చిన అన్నారు. ఆధునిక ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వలన నిరుద్యోగము పెరగదని సాంకేతిక మార్పులకు అనుగుణంగా విద్యార్థులు నైపుణ్యములను తప్పనిసరిగా నేర్చుకోవాలని ఉద్భోదించారు.

కమల ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సింగాపురం మెకానిక్ ఇంజనీరింగ్ విభాగాధిపతి మరియు డీన్ డాక్టర్ ఎం.వీ. సతీష్ కుమార్ (Computational Intelligence for optimization in Industry 4.0 scenario an over view) కంప్యూటర్ ఇంటెలిజెన్స్ ఫర్ ఆప్టిమేజేషన్ ఇన్ ఇండస్ట్రీ 4.0 సినారియో అనే విషయంపై శిక్షణ ఇచ్చారు. సతీష్ కుమార్ మాట్లాడుతూ ఆధునిక పరిజ్ఞానంతో ఇప్పుడు పారిశ్రామిక రంగము ఎంతో అభివృద్ధి చెందుతున్నదని యంత్రములు స్వతంత్రముగా నిర్ణయాలు తీసుకుంటున్నాయని వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే ఈశ్వరయ్య మాట్లాడుతూ విద్యార్థులు అధ్యాపకులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవాలని సమాజానికి అవసరమైన ప్రాజెక్టు చేయాలని యంత్రములు ను ఆధునికీకరించవలనని వివరించారు శిక్షణ కార్యక్రమంలో భాగంగా అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ కొమురయ్య ఫైబర్ కాంపోజిట్ అనే అంశం పైన శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్త డాక్టర్ జి. మల్లయ్య, సహ సమన్వయకర్త డాక్టర్ ఎస్. రాజేంద్రప్రసాద్ సిబ్బంది అధ్యాపకులు పాల్గొన్నారు. శివరామకృష్ణను సతీష్ కుమార్ కొమురయ్యను ప్రిన్సిపాల్ ఈశ్వరయ్య సన్మానించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News