- జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్


నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- ఆధునిక సాంకేతిక విద్యా ప్రమాణాలను మరింత పెంపొందించి అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా అభ్యర్థులకు అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ మండల కేంద్రంలో, మంచిర్యాల పట్టణంలోని ఐటిఐ కళాశాల ప్రాంగణంలో కొనసాగుతున్న అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఆధునిక సాంకేతిక విద్యా ప్రమాణాలతో అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా నేటి పోటీ ప్రపంచంలోని సాంకేతికను అభ్యర్థులకు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కేంద్రాల ద్వారా ఆధునిక రంగాలలో అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా వివిధ అత్యాధునిక సాంకేతికత కోర్సులను అందించడం జరుగుతుందని, వృత్తి విద్యా కోర్సులలో శిక్షణ అందించి ఉపాధి పొందేలా అవకాశాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఐటిఐ కళాశాల ప్రిన్సిపల్ రమేష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.




