- రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్
నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐటిఐ) లతో పాటు నూతనంగా ఏర్పాటు చేస్తున్న అడ్వాన్సడ్ టెక్నాలజీ సెంటర్ (ఏటిసి) లతో ఆధునీక సాంకేతికత కలిగిన శిక్షణ అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటిఐ కళాశాల ప్రాంగణంలో నిర్మిస్తున్న ఏటిసి సెంటర్, ఐటిఐ కళాశాలను ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ శాఖ చైర్మెన్ ,మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఉపాధి శిక్షణ సంస్థ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ సీతారామయ్య, మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావు, ఐటిఐ కళాశాల ప్రిన్సిపల్ రమేష్ లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో నిర్వహిస్తున్న ఐటిఐ కళాశాలలతో పాటు ఆధునిక సాంకేతికత కలిగిన అడ్వాన్సడ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేసి, శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఏటిసి సెంటర్ పనులను వేగవంతం చేసి, త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల, నస్పూర్ మండలాల తహశీల్దార్లు రఫతుల్లా, శ్రీనివాస్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.





