నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్. సి (రాఘవుల శ్రీనివాసు): ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ నీ వెల్డింగ్ టెక్నాలజీ ఆధునీకీకరణలో ఉపయోగిస్తున్నారు. వెల్డింగ్ టెక్నాలజీలో నాణ్యతను పెంచుటకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ టెక్నాలజీని వాడుతున్నారని ఎన్ ఐ టి సూరత్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కే కృష్ణ కిషోర్ అన్నారు. కమల ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ సింగాపురంలో జరుగుతున్న అటల్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ మూడవరోజు శిక్షణ శిబిరమునకు కృష్ణ కిషోర్ ముఖ్య శిక్షకుడిగా హాజరైనారు కృష్ణ కిషోర్ మెకానికల్ ఇంజనీరింగ్ లో కంప్యూటర్ పరిజ్ఞానమును ఏ విధముగా వాడుతున్నారో వివరించారు. వెల్డింగ్ టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ టెక్నాలజీని ఉపయోగించి నాణ్యమైన వెల్డింగ్ చేస్తున్నారనే ఇప్పుడు ఆడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనే మరొక సాంకేతిక విజ్ఞానము మెకానికల్ ఇంజనీరింగ్ లో అందుబాటులో ఉన్నదని ఆటిట్యూడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉపయోగించడం వలన వస్తు ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని ఒక వస్తువును తయారు చేసినప్పుడు దాని మెకానికల్ ధర్మాలు ఆ వస్తువు యొక్క ఉపయోగాన్ని నిర్దేశిస్తాయని అన్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఎన్నో ఉపాధి అవకాశాలు ఉన్నాయని మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కొత్త కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయని వివరించారు. మెకానికల్ ఇంజనీరింగ్ రంగంలో వస్తున్న కొత్త కొత్త మార్పులను ఇంటర్నేషనల్ జర్నల్స్ చదవటం వలన అధ్యాపకులు తమ యొక్క విజ్ఞానాన్ని పెంచుకోవచ్చని వివరించారు. మధ్యాహ్నం శిక్షణలో భాగముగా కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల టెక్నాలజీ అండ్ సైన్స్ వరంగల్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె అశోక్ రెడ్డి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనే అంశం మీద శిక్షణ ఇచ్చారు కళాశాల డైరెక్టర్ డాక్టర్ కే శంకర్ మాట్లాడుతూ కళాశాల అధ్యాపకులకు విద్యార్థులకు అవసరమైన అన్ని ప్రయోగశాలలను అందుబాటులోకి తెచ్చామని మంచి ప్రాజెక్టులు చేస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డీన్ డాక్టర్ ఎం వి సతీష్ కుమార్, సమన్వయకర్త డాక్టర్ జి మల్లయ్య సహస, డాక్టర్ ఎస్ రాజేందర్ ప్రసాద్, అధ్యాపకులు డాక్టర్ జాన్సన్, వేణుమాధవ్, రామకృష్ణ, శ్రీధర్, వెంకటేష్ వివిధ కళాశాలలు చెందిన అధ్యాపకులు పాల్గొన్నారు.





