- సొసైటీ చైర్మన్ ఫ్రాంక్ విశ్వనాథ్
- తొగరు రాజుకు ఘన సన్మానం
నేటి సాక్షి, లక్షెట్టిపేట, ( బైరం లింగన్న) : ప్రజా సేవా ద్వారానే సమాజంలో మంచి పేరు, గుర్తింపు వస్తుందని కమ్యూనిటీ అండ్ రూరల్ డెవలప్ మెంట్ సొసైటీ చైర్మన్ ఫ్రాంక్ విశ్వనాథ్ పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్ లోని మేడిపల్లిలోని తమ కార్యాలయంలో కమ్యూనిటీ అండ్ రూరల్ డెవలప్ మెంట్ సొసైటీ ద్వారా నిర్వహించే బాలబాట కార్యక్రమంలో ఏరియా కో ఆర్డినేటర్ గా పది సంవత్సరాల పాటు పలు సేవా కార్యక్రమాలతో పాటు సాయంత్రం పిల్లలకు ట్యూషన్ చెప్పించడం, విద్య ప్రాముఖ్యతపై అవగాహన, తదితర అంశాలపై చేసిన సేవలను గుర్తించి రజతోత్సవ వేడుకల్లో పట్టణానికి చెందిన తొగరు రాజును ఘనంగా సన్మానించి, జ్ఞాపిక, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. మారుతున్న సమాజంలో ఎన్నో రుగ్మతలు ఉన్నాయన్నారు. వాటిని రూపుమాపడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ ఫ్రాంక్ విశ్వనాధ్ జర్మనీ, ముఖ్య అతిథి శ్రవణ్, సొసైటీ డైరెక్టర్లు రజిని, మేరీ, అనిత, తెలంగాణ డిప్యూటీ డైరెక్టర్ దివ్య, పుష్ప తదితరులు పాల్గొన్నారు.





