Tuesday, March 17, 2026

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై మోడీ సర్కార్ వివక్ష

  • కేంద్రపద్దులో వాటా దక్కకున్న అభివృద్ధి ఆగదు: కెఎల్ఆర్
  • గ్రామాలకు వచ్చే బీజేపీ నేతలను నిలదీయండి

నేటి సాక్షి ప్రతినిధి మహేశ్వరం (చిక్కిరి శ్రీకాంత్): కేంద్ర బడ్జెట్ లో కాంగ్రెస్ పాలిత తెలంగాణ రాష్ట్రాన్ని చిన్నచూపు చూసినా అభివృద్ధి, సంక్షేమం ఆగదని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు.ఫ్యూచర్ సిటీలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న స్కిల్ యూనివర్శిటీ సహా పాలమూరు- రంగారెడ్డి, మెట్రో కారిడార్, త్రిబుల్ ఆర్ నిర్మాణాల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపినా పట్టించుకోలేదని విమర్శించారు. కేంద్రపద్దులో రాష్ట్రానికి కనీస వాటా దక్కకపోవటంపై బీజేపీ నాయకులు, కేంద్రమంత్రులు ఇప్పటికైనా స్పందించాలని కోరారు. బీజేపీ చూపుతున్న వివక్షతను రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకోవాలని కేఎల్ఆర్ కోరారు. ఏ మోఖం పెట్టుకుని వచ్చే పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతారని కిచ్చెన్న ప్రశ్నించారు.సవతి తల్లి ప్రేమను చూపకుండా అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని కాంగ్రెస్ నేత లక్ష్మారెడ్డి కోరారు. మహేశ్వరం నియోజకవర్గం.మహానగరంగాతీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుందని కేఎల్ఆర్ అన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News