నేటిసాక్షి, కొడిమ్యాల : టీయూడబ్ల్యూజే హెచ్ 143 కొడిమ్యాలలో ఆదివారం మండల ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ రఫీ ఎన్నికయ్యారు.జిల్లా కమిటీ ఆదేశాల మేరకు మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బూర్ల రమేష్, అధ్యక్షుడు పైడిపల్లి సతీష్ రావు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా నియామకమైన జిల్లా ప్రధాన కార్యదర్శి అడ్లగట్ట గంగాధర్, మండల ప్రధాన కార్యదర్శి మహమ్మద్ రఫీని, మండల ప్రెస్ క్లబ్ సభ్యులు శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనియన్ బలోపేతానికి, జర్నలిస్టుల హక్కుల సాధనకు కృషి చేస్తామని తెలిపారు.





