నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి.(రాఘవుల శ్రీనివాసు):
సెరికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ గా మహమ్మద్ రషీద్ పదోన్నతి పొందారు. రషీద్ హనుమకొండ జిల్లాలో రెండు సంవత్సరాలు పనిచేసిన అనంతరం డిప్యూటేషన్ పై హుజురాబాద్ లో సెరికల్చర్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు. అంతేకాకుండా జూలై 2024 నుండి జిల్లాలో ఒకే ఒక అధికారిగా పట్టు సాగు చేస్తున్న రైతులకు సలహాలు సూచనలు అందిస్తూ పట్టు పరిశ్రమ అభివృద్ధికి కృషి చేశాడు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చిన్న పాపయ్యపల్లి రంగాపూర్ గ్రామాలకు ప్రత్యేక అధికారిగా పనిచేశారు. శాఖా పరమైన అర్హతలు ఉన్నందున రసీదును సహాయపట్టు పరిశ్రమ అధికారిగా పదోన్నతి కల్పిస్తూ డైరెక్టర్ ఆఫ్ సెరికల్చర్ యాస్మిన్ భాష ఉత్తరుడు జారీ చేశారు.





