Tuesday, March 24, 2026

రెవెన్యూ, రీ సర్వే అంశాలపై మరింత దృష్టి సారించాలి

  • భూ సంబంధిత అంశాలు త్వరిత గతిన నాణ్యతగా తప్పులు లేకుండా పరిష్కరించాలి
  • రెవెన్యూ సదస్సులు, పీజీ ఆర్ ఎస్ తదితర అర్జీల భూ సంబంధిత అంశాలను ప్రాధాన్యతగా నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలి
  • జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్

నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) తిరుపతి: కలెక్టరేట్ రీ సర్వే రెవెన్యూ భూ సంబంధిత అంశాలు ప్రజలతో ముడిపడి ఉంటాయని, వాటిని సకాలంలో పరిష్కరిస్తే చాలా వివాదాలు ఉండవని, పీజీ ఆర్ ఎస్ తదితర గ్రీవెన్స్ ల ద్వారా, రెవెన్యూ సదస్సుల్లో అందిన పలు భూ సంబంధిత మ్యూటేశన్, సర్వే, పాస్ పుస్తకం, సర్వే నంబర్ సబ్ డివిజన్ తదితర అంశాలపై వచ్చిన అర్జీలను అత్యంత ప్రాధాన్యత గా చేపట్టి సకాలంలో బియాండ్ ఎస్ఎల్ఎ కి వెళ్లకుండా పరిష్కరించాలని, సదరు అంశాన్ని ఉన్నత స్థాయిలో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని, మరింత బాధ్యతగా అధికారులు పని చేయాలనీ జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు కలెక్టర్ గారు జెసి శుభం బన్సల్ మరియు జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు తో కలిసి జిల్లాలోని అందరు ఆర్డీవో లు, తహశీల్దార్లు, సర్వేయర్లతో రీ సర్వే, భూ సంబంధిత రెవెన్యూ అంశాలపై రెవెన్యూ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రౌండ్ ట్రూతింగ్ లో తక్కువ పురోగతి ఉందని, రీ సర్వే ప్రక్రియ జాగ్రత్తగా చేపట్టాలని, ఎఫ్పీఓఎల్ఆర్, గ్రౌండ్ ట్రూతింగ్ సకాలంలో చేయాలని అలా అని ఆత్రంగా తప్పులు చేయరాదని, రీ సర్వే నాణ్యతగా ఉండాలని, తగినన్ని రోవర్లు వినియోగించాలని సూచించారు. పలువురు అధికారులతో క్షేత్ర స్థాయిలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను, పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు,వారి సూచనలు సలహాలు అడిగి తెలుసుకున్నారు. రీ సర్వే జరిపే భూమి, తేదీ సమయం సంబంధిత భూ యజమానులకు, రైతులకు, పట్టాదారుకు, ఎంజాయర్స్, ఇంట్రెస్టెడ్డ్ పార్టీ వారికి నోటీసు ద్వారా తెలిపి, పారదర్శకంగా వారి సమక్షంలో జరిగేలా చూడాలని సూచించారు. గ్రౌండ్ ట్రూతింగ్ అయ్యాక సంబంధిత అధికారులు సర్వేయర్, సచివాలయం వీఆర్వోలతో కలిసి వెక్టరైజేషన్ పూర్తి చేయాలని వివరాలు నమోదు చేయాలని సూచించారు. కొర్రిలేషన్ ప్రక్రియ ఎల్పీఎం జనరేషన్ ప్రక్రియ సక్రమంగా జరగాలి అని సూచించారు. గతంలో రీ సర్వే స్టోన్లు పాతిన వాటిపై రాతలు చెరిపే ప్రక్రియ వేగవంతం చేసి పూర్తి చేయాలని సూచించారు. గ్రామసభలలో రెవెన్యూ సదస్సుల్లోని రీ సర్వే పెండింగ్ అంశాలు ఎక్కువగా ఉన్నాయని, వాటిని త్వరితగతిన ప్రణాళికా బద్ధంగా పరిష్కరించాలని, టైం లైన్ ఏర్పాటు చేసుకుని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎఫ్ లైన్ రిపోర్ట్, ఆన్లైన్ సబ్ డివిజన్ బియాండ్ ఎస్ఎల్ఎ కి వెళ్లకుండా పరిష్కరించాలని సూచించారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెవెన్యూ సదస్సులను నిర్వహించడం అనేది రెవెన్యూ సమస్యలను గ్రామ స్థాయిలోనే పరిష్కరించే సదుద్దేశ్యంతో చేపట్టడం జరిగిందని, ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యతగా త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. భూ హక్కు పత్రం, మ్యూటేషన్, 22ఎ నిషేధిత భూములు, సర్వే నంబర్ సబ్ డివిజన్, తదితర భూ సంబంధిత పెండింగ్ అంశాల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. డివిజన్ కార్యాలయాల నుండి ఫైళ్ళను e- ఆఫీస్ నందు పంపేలా కార్యాలయాలు సిద్ధం కావాలని తెలిపారు. కోర్టు కేసుల్లో సకాలంలో స్పందించి నిబంధనల మేరకు చర్యలు చేపట్టాలని సూచించారు. చాలా కాలం నుండి పెండింగ్ ఉన్న పలు భూ సంబంధ అంశాలకి పరిష్కారం చూపడం జరిగిందనీ, భూసేకరణ పనులు వేగవంతం అయ్యాయని, మరింత బాగా పని చేయాలని అధికారులకు సూచించారు. ఈ సదస్సు ఉదయం నుండి సాయంత్రం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఆర్డీవోలు రామ్మోహన్, భాను ప్రకాష్ రెడ్డి, కిరణ్మయి, ఎస్డీసీలు దేవేందర్ రెడ్డి రోజ్ మాండ్, జిల్లా సర్వే అధికారి అరుణ్ కుమార్ తాసిల్దార్ లు, సర్వేయర్లు కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News