Friday, April 3, 2026

పదవ తరగతి వార్షిక పరీక్ష కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు

  • పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు
  • పరీక్షా కేంద్రాల వద్ద 163 బిఎన్ఎస్ఎస్ -2023 అమలు
  • జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపిఎస్

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : వనపర్తి జిల్లా కేంద్రంలో ఉన్న పదవ తరగతి వార్షిక పరీక్ష కేంద్రాలు సరస్వతి శిశు మందిర్ స్కూల్, హరిజనవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పరీక్ష కేంద్రం నందు పరీక్షలు జరుగుతున్న సరళిని పరిశీలించారు . విద్యార్థుల హాజరు వివరాలు అడిగి తెలుసుకున్నారు.బందోబస్తు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులకు సిబ్బందికి పటిష్టమైన బందోబస్తు గురించి తగు సూచనలు సలహాలు చేశారు.ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల వద్ద బిఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. జిల్లాలోని 36 పరీక్ష కేంద్రాలలో 6853 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారని తెలిపారు, ఈ పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు .పరీక్షలు జరిగే సమయంలో సిబ్బంది అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరీక్షా కేంద్రాలకు పేపరు వచ్చేటప్పుడు తీసుకొని వెళ్లేటప్పుడు తప్ప కుండా ఎస్కార్ట్ ఉండాలని సూచించారు. పరీక్షలు జరిగే సమయంలో అధికారులు పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో వనపర్తి సీఐ, కృష్ణ, వనపర్తి పట్టణ ఎస్సై,హరిప్రసాద్, పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News