
నేటి సాక్షి, మందమర్రి:- పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నోముల ఉపేందర్ గౌడ్, సీనియర్ నాయకుడు సోత్కు సుదర్శన్ లు మాట్లాడుతూ, కాకా వెంకటస్వామి తనయుడు చెన్నూరు శాసనసభ్యులు డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి, వారి ఆశయాలను కొనసాగిస్తూ, పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని చెన్నూరు నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ను ఎల్లప్పుడూ చెన్నూరు ప్రజలు మర్చిపోరని తెలిపారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటికరణ చేద్దామని ఆలోచనలు చేస్తుంటే, ఎంపీ గడ్డం వంశీకృష్ణ మొట్టమొదటిసారిగా పార్లమెంటులో సింగరేణి ప్రైవేటీకరణను అడ్డు కుంటామన్నారని గుర్తు చేశారు. ఎంపీ వంశీకృష్ణ కుటుంబం ఎల్లప్పుడూ కార్మికుల కొరకు, ప్రజల కొరకు పాటుపడే కుటుంబమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సింగిల్ విండో చైర్మన్ ఎస్ ప్రభాకర్ రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మంద తిరుమల్ రెడ్డి, పుల్లూరి లక్ష్మణ్, పైడిపల్లి నర్సింగ్, నేరువట్ల శ్రీనివాస్, గడ్డం రజిని, కనకం రాజు, ఎండి జమీల్, మంకు రమేష్, ఎండి సుకూర్, మహంత్ అర్జున్, ఎర్ర రాజు, వడ్లురి సునీల్ కుమార్, బుర్ర ఆంజనేయులు గౌడ్, అంకం రాజకుమార్, నామిని ముత్తయ్య, బండి శంకర్ గౌడ్, రెడ్డి ఐల్లయ్య, సురేందర్, రాయబారపు కిరణ్, శ్రీనివాస్, మూడారం శేఖర్, తుంగపిండి విజయ్, వీరన్న, లక్ష్మణ్, ఎండి ఇసాక్, ఎండి జావిద్ ఖాన్, మహిళా నాయకురాలు పోచంపల్లి లక్ష్మీ, కవిత, గోలేటి లక్ష్మీ, రమేష్, వెంకటాద్రి, శ్రీనివాస్, రాజేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన, సోషల్ మీడియా కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





