నేటి సాక్షి, తిరుపతి న్యూస్ తిరుపతి ప్రతినిధి డాక్టర్ శివ : తిరుపతి ఎంపీ డా. మద్దిల గురుమూర్తి తన పార్లమెంటు నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా విని, వాటికి పరిష్కార మార్గాలను కనుగొనేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో, ఆయన కార్యాలయానికి వివిధ సమస్యలతో విచ్చేసిన వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకొన్నారు. వెంటనే అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. పార్లమెంటు సమావేశాల సమయంలో మినహా ఆయన తిరుపతిలోని తన కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.





