- మల్టీపర్పస్ వర్కర్లకు పలు సూచనలు
నేటి సాక్షి, కమలాపూర్ :
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని శుక్రవారం రోజున మండల పరిషత్ అభివృద్ధి అధికారి గుండె బాబు కమలాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని శానిటేషన్ నిర్వహణ అనగా రోడ్ల పరిశుభ్రత మరియు డ్రైనేజీలలో ఎప్పటికప్పుడు చెత్త తీసివేయడం వంటి పనులను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కమలాపూర్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల కార్యదర్శిలను ప్రతి రోజు ఉదయాన్నే గ్రామ పంచాయతీలలో మల్టీపర్పస్ వర్కర్ల ద్వారా రోడ్లన్నీ శుభ్రపరిచే విధంగా, డ్రైనేజీలలో పేరుకుపోయిన చెత్తాచెదారము వెనువెంటనే తీసివేసే విధంగా, డ్రైనేజీలలో ఎక్కడ కూడా నీరు నిల్వ ఉండకుండా ఉండే విధంగా చూడాలని, శానిటేషన్ నిర్వహణ సరిగా నిర్వహించని కార్యదర్శులపై గాని, గ్రామపంచాయతీ mpw ల పైన కఠిన చర్యలు ఉంటాయని ఆదేశించారు. ప్రతిరోజు పంచాయతీ కార్యదర్శులు విధిగా మల్టీపర్పస్ వర్కర్లు ఏ వార్డులో శానిటేషన్ నిర్వహణ చేసినారు, ఏ రకమైన పనులు నిర్వహించినారనే విషయాలను తెలుపుతూ వాటికి సంబంధించిన నోట్ క్యాం ఫోటోలను మండల కార్యాలయానికి వచ్చే విధంగా వాట్సాప్ గ్రూపులలో పంపించాలని తెలియపరచడం జరిగింది.

