నేటి సాక్షి, ఎండపల్లి (రియాజ్): మండలంలోని గొడిశేలపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు సాయంత్రం ప్రత్యేక తరగతి సమయంలో అల్పాహారం ఏర్పాటుకు మండల పరిషత్ అభివృద్ది అధికారి జక్కుల శ్రీనివాస్ చేయూత అందించారు. పదో తరగతిలో ఉత్తీర్ణతాశాతం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఇందులో భాగంగానే ప్రత్యేక తరగతుల ద్వారా విద్యార్థులు ఎక్కువ సమయం చదువుపై దృష్టి సారిస్తుండటం వల్ల కలిగే అలసటను తొలగించి ఉత్తేజం నింపేందుకు ఈ అల్పాహారం ఏర్పాటు చేయడం జరుగుతుందని, దీనికి తన స్వంత ఖర్చుల నుండి ఒక వారానికి సరిపడ అల్పాహారం సమకురుస్తున్నట్లు ఎంపీడీవో ప్రకటించి ఇందుకు అవసరమైన సామాగ్రిని స్థానిక పంచాయతీ కార్యదర్శి ఎం.డీ హఫీజ్ ద్వారా మంగళవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు కనకం జయ, ఆఆపా కమిటీ చైర్మన్ ఓరగంటి లత లకు అందజేశారు.





